యాదాద్రి ఆలయ పునఃప్రారంభం ముహూర్తం ఖరారు అయింది. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 2022 మార్చి 20 నుంచి మహా సుదర్శన యాగం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో తెలంగాణ అణచివేయబడిందని చెప్పారు. గొప్ప ఆధాత్మిక సంపద ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో పుష్కరాలు కూడా నిర్వహించే వారు కాదన్నారు. ఉద్యమ సమయంలో ప్రశ్నిస్తే పుష్కర ఘాట్లు నిర్మించారని గుర్తు చేశారు. జోగులాంబ దేవాలయం గొప్ప శక్తిపీఠమని తెలిపారు. కృష్ణా పుష్కరాలను జోగులాంబ గద్వాలలో ప్రారంభించామన్నారు.
పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు
الثلاثاء، 19 أكتوبر 2021
telangana yadadri పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు మహా సుదర్శన యాగం మహాకుంభ సంప్రోక్షణ
ليست هناك تعليقات:
إرسال تعليق