తొలిసారి ఆఫర్‌లో పోకో ఎఫ్3 జీటీ

Tuesday, October 19, 2021

Diwali Sale flipkart Smartphone తొలిసారి ఆఫర్‌లో పోకో ఎఫ్3 జీటీ

t f B! P L



ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ తొలిసారి భారీ డిస్కౌంట్‌లో లభిస్తోంది. దీంతోపాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో రూ.28,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.12,000 లోపే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,950 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. ఇందులో రూ.1,000 అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.14,950 విలువ చేస్తే మీకు మొత్తం రూ.15,950 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి మీరు రూ.13,049 చెల్లించి రూ.28,999 విలువైన పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు. మీరు ఎస్‌బీఐ కార్డుతో కొంటే మరో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ.12,000 లోపే పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కాకుండా నేరుగా ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను ఆఫర్‌తో రూ.25,999 కొనొచ్చు. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్‌ను రూపొందించింది పోకో ఇండియా. గేమ్స్ ఆడేవారి కోసం మాగ్లేవ్ ట్రిగ్గర్స్, జీటీ స్విచెస్ ఉండటం విశేషం. బటన్స్ బయటికి ఉంటాయి కాబట్టి గేమ్స్ ఆడేప్పుడు వెంటనే స్పందించడానికి ఉపయోగపడతాయి.  ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేయడం విశేషం. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల టర్బో అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. డాల్బీ అట్మాస్ సౌండ్‌తో డ్యూయెల్ స్పీకర్స్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌లో 5065ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎల్ షేప్‌లో ఛార్జింగ్ కేబుల్ ఉండటం విశేషం. 15 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే ఒక రోజు ఈ స్మార్ట్‌ఫోన్ వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రిడేటర్ బ్లాక్, గన్‌మెటల్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ