ఆకుకూరలు తినమన్నా, పాలు తాగమన్నాపిల్లలు వద్దంటే వద్దని అంటారు. అలాంటప్పుడు వాళ్లు ఇష్టపడేలా వండిపెట్టాలి. ' ప్రొటీన్ తొందరగా అరగదని, అది బాడీ బిల్డర్స్‌కి మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు చాలామంది తల్లులు. కానీ, ప్రొటీన్ అందరికీ అవసరమే. ఈ హైప్రొటీన్ కబాబ్స్ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు.
కబాబ్స్ కోసం కావాల్సినవి:
శనగలు (నానబెట్టినవి), అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మసాలాలు (చాట్‌మసాలా, మిరియాలపొడి, ఇంగువ, ఉప్పు, ధనియాలపొడి, పసుపు, చిల్లీ ఫ్లేక్స్), కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిగడ్డ, నువ్వులు, నూనె.
తయారీ: ఒక గిన్నెలో నానబెట్టిన శనగలు, అల్లం, వెల్లుల్లి, మసాలాలు, పచ్చిమిర్చి తరుగువేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి. కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిగడ్డ తరుగు, నువ్వులు వేసి అన్నీ బాగా కలపాలి. తర్వాత చిన్న ఉండలు చేసి కబాబ్స్‌లా వత్తాలి. నూనె వేడిచేసి కబాబ్స్‌ను ఎర్రగా ఫ్రై చేయాలి.
ليست هناك تعليقات:
إرسال تعليق