మరో విశ్వ క్రీడా సంగ్రామానికి తెరలేచింది. టోక్యో వేదికగా మంగళవారం పారాఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పారాఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు జపాన్ చక్రవర్తి నరుహిటో, ప్రధాని సుగా హాజరయ్యారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. పతకాలే లక్ష్యంగా భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ ప్రారంభోత్సవంలో భారత త్రివర్ణ పతాకాన్ని జావెలిన్ త్రోయర్ టెక్ చంద్ చేతబూని మన దేశ బృందాన్ని నడిపించాడు.
ليست هناك تعليقات:
إرسال تعليق