అప్రిలియా SXR GT 125, SXR GT 175 స్కూటర్ విడుదల

Friday, October 2, 2026

Aprilia SXR GT 125 and SXR GT 175 Scooters Launched automobile business ex-showroom Delhi prices are ₹1.11 lakh and ₹1.31 lakh technology

t f B! P L

దేశీయ మార్కెట్లో ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా SXR GT 125, SXR GT 175 అనే రెండు కొత్త మ్యాక్సీ స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. వీటి ఎక్స్‌-షోరూమ్ ఢిల్లీ ధరలు వరుసగా రూ.1.11 లక్షలు, రూ.1.31 లక్షలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న Aprilia డీలర్‌షిప్‌లలో వీటి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతంలో మార్కెట్లో విక్రయించిన SXR 125, SXR 160 మోడళ్లను కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన లేకుండానే నిలిపివేసింది. దీంతో ఏర్పడిన మ్యాక్సీ స్కూటర్ గ్యాప్‌ను ఇప్పుడు కొత్త SXR GT మోడళ్లతో భర్తీ చేస్తోంది. ఈ రెండు స్కూటర్లు గతేడాది మార్కెట్లోకి వచ్చిన SR 125, SR 175 మోడళ్ల ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించబడ్డాయి. SXR GT 125లో 124.5cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7,400rpm వద్ద 10.6hp పవర్, 6,200rpm వద్ద 10.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక SXR GT 175లో 174.7cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉండగా.. ఇది 7,200rpm వద్ద 13.3hp, 6,000rpm వద్ద 14.1Nm టార్క్‌ను అందిస్తుంది. రెండు మోడళ్లలోనూ 3-వాల్వ్ SOHC లేఅవుట్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఫోర్స్‌డ్ ఎయిర్ కూలింగ్ ఉన్నాయి. ఇవి BS6 OBD-II Stage B నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో పాటు E20 ఇంధనానికి కూడా అనుకూలంగా ఉంటాయి. మెరుగైన పవర్ డెలివరీ, టార్క్, యాక్సిలరేషన్‌తో పాటు రోజువారీ వినియోగంలో మంచి ఇంధన సామర్థ్యం అందించేలా ఇంజిన్లను ట్యూన్ చేసినట్లు తెలిపింది. కొత్త SXR GT స్కూటర్ల డిజైన్‌లో మ్యాక్సీ స్కూటర్ స్టైలింగ్‌ను కొనసాగించారు. అయితే పాత మోడళ్లతో పోలిస్తే 12 అంగుళాల స్థానంలో 14 అంగుళాల పెద్ద వీల్స్ అందించారు. దీంతో హైస్పీడ్‌లో స్థిరత్వం, లాంగ్ రైడ్‌లలో రైడింగ్ కంఫర్ట్ మెరుగుపడుతుందని కంపెనీ భావిస్తోంది. ముందుభాగంలో Aprilia ప్రత్యేకమైన Tripod LED హెడ్‌ల్యాంప్‌ను కొనసాగించింది. బాడీవర్క్ కొంత పెద్దదిగా ఉండటంతో పాటు కొత్త గ్రాఫిక్స్‌ను పొందింది. SXR GT 175లో 5-అంగుళాల TFT డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో Bluetooth కనెక్టివిటీ, మ్యూజిక్ మరియు కాల్ మేనేజ్‌మెంట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యాండిల్‌బార్‌పై అదనపు కంట్రోల్స్ కూడా ఇచ్చారు. మరోవైపు SXR GT 125లో 5-అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. రెండు స్కూటర్లలోనూ ముందు 220mm డిస్క్ బ్రేక్, వెనుక 140mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. SXR GT 175లో సింగిల్-ఛానల్ ABS ఉండగా, SXR GT 125లో CBS సేఫ్టీ సిస్టమ్‌ను అందించారు. సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ఐదు దశల్లో ప్రీలోడ్ అడ్జస్ట్ చేసుకునే డ్యూయల్-ఎఫెక్ట్ హైడ్రాలిక్ రియర్ షాక్‌ను ఉపయోగించారు. SXR GT 125ను Matte Black, Glossy Azzurro, Glossy White రంగుల్లో అందిస్తున్నారు. SXR GT 175 మాత్రం Metallic Blue, Matte Black, Matte Green రంగుల్లో లభిస్తుంది. GT రేంజ్‌కు ప్రత్యేకమైన ఫుట్‌బోర్డ్ గ్రాఫిక్స్ కూడా 175 మోడల్‌లో ఉన్నాయి.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ