త్వరలో శామ్‌సంగ్ గెలాక్సీ F70 5G విడుదల - LATEST NEWS AP TO TG

LATEST NEWS AP TO TG

One step One Vision

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, October 8, 2026

త్వరలో శామ్‌సంగ్ గెలాక్సీ F70 5G విడుదల

దేశీయ మార్కెట్లో శామ్‌సంగ్ గెలాక్సీ F70 5G విడుదలకు సిద్ధమైంది. ఈ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తో పాటు గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైసెస్ లిస్ట్‌లో కనిపించింది. BIS లిస్టింగ్‌లో మోడల్ నంబర్ SM-E176E తో నమోదవగా, గూగుల్ ప్లే లిస్టింగ్‌లో ఇదే మోడల్‌ను 'a17x' కోడ్‌నేమ్‌తో జత చేశారు. కాగా, ఇదే కోడ్‌నేమ్‌ను గెలాక్సీ A17 5G కోసం కూడా ఉపయోగిస్తున్నారు.  సాధారణంగా సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో ఫోన్ కనిపించిందంటే కొన్ని రోజులు లేదా వారాల్లోనే సేల్‌కు వస్తుందని భావిస్తారు. శామ్‌సంగ్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఫ్లిప్‌కార్ట్‌లో F70e లాంచ్ అవ్వగా, ఆగస్టులో F70 Pro భారత్‌లోకి వచ్చింది. ఇప్పుడు రాబోతున్న స్టాండర్డ్ F70 5G ఫోన్ ఫీచర్లు, ధర పరంగా ఈ రెండింటికీ మధ్యలో ఉండే అవకాశం ఉంది. దసరా, దీపావళి పండుగల సేల్స్ సీజన్‌ను క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా శామ్‌సంగ్ దీనిని మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. బిఐఎస్ డేటాబేస్‌లో SM-E176E/DS మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ కనిపిస్తోంది. దీని తేదీ సెప్టెంబర్ 29, 2026గా నమోదు కావడంతో భారత్‌లో ఈ ఫోన్ లాంచ్‌కు సై అంటోందని అర్థమవుతోంది. అలాగే, గూగుల్ పబ్లిక్ డివైస్ లిస్ట్‌లో SM-E176E మోడల్ 'a17x' ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానమై ఉంది. గెలాక్సీ A17 5Gకి కూడా ఇదే ఐడెంటిఫైయర్ వాడటంతో, ఇది A17 5Gకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందనే వార్తలకు బలం చేకూరుతోంది.  ఈ F70 5G ఫోన్‌లో 6.7-అంగుళాల Full HD+ 90Hz Super AMOLED డిస్‌ప్లే, ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లు ఉండవచ్చు. అలాగే 25W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఇచ్చే అవకాశం ఉంది. ధర విషయానికొస్తే.. ఇది ఫ్లిప్‌కార్ట్ లోని F70e కి, ₹25,999 ధర ఉన్న F70 Pro మోడల్‌కు మధ్యలో.. అంటే సుమారు ₹21,999 నుండి ₹24,999 రేంజ్‌లో ఉండే ఛాన్స్ ఉంది. ప్రొ మోడల్ మాదిరిగానే దీనికి కూడా 6 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు అందించే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages