చెత్తను సేకరిస్తున్న మున్సిపల్‌ ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం : ఇద్దరు యువకుల మృతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు

Monday, October 5, 2026

Another Critically Injured Husnabad town Siddipet district telangana Two youths die Two-Wheeler Rams into Municipal Garbage Tractor

t f B! P L

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని హనుమకొండ ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై చెత్తను సేకరిస్తున్న మున్సిపల్‌ ట్రాక్టర్‌ను ఉదయం 8 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని హనుమకొండ రహదారిపై మున్సిపల్‌ సిబ్బంది చెత్తను సేకరిస్తూ ట్రాక్టర్‌ను రోడ్డుపై నిలిపి ఉంచారు. అదే సమయంలో ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు వేగంగా వస్తూ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ప్రమాదం ధాటికి బైక్‌పై ఉన్న నద్దునూరి శ్రీకాంత్‌, నరసింహలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై తీవ్ర రక్తస్రావం కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హుస్నాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కు చెందినవారు. ద్విచక్రవాహనంపై ఉన్న మూడో వ్యక్తి నద్దునూరి శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ