Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టా సమీపంలో నేడు ఆర్మీకి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పాకిస్తాన్ ఆర్మీ పైలట్లు మరణించారని సైన్యం తెలిపింది. మృతులను శిక్షణా పైలట్ అయిన మేజర్ హుస్నైన్ షెహజాద్ హుమాయున్, విద్యార్థి పైలట్ అయిన కెప్టెన్ అబ్దుల్ సమద్‌గా గుర్తించారు. క్వెట్టా జిల్లాలోని నవాన్ కిల్లీ సమీపంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నం సమయంలో ముష్షక్ శిక్షణా విమానం కూలిపోయినట్లు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పాక్ ఆధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఇద్దరు సైనికాధికారుల మృతి పట్ల సంతాపం తెలిపారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement