తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో ఇవాళ పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర జల వనరుల సంక్షోభ పరిస్థితులు నెలకున్నాయని అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇప్పటికే రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో రెండో పంట వేసి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు.రెండో పంట వేసి, నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు. ఎల్‌నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా ఉందన్న మంత్రి.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ బృందం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలవనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తామన్నారు. రాష్ట్రానికి అధిక ఆర్థిక సహాయం అందించేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, జీ రామ్ జీ పథకం కింద గ్రామాల్లో అదనపు పనిదినాలు కల్పించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు.
Travel the world
Climb the mountains
Government making all-out efforts to save the first cropMinister Ponguleti Srinivas ReddySevere water crisis in the state due to El Niño impacttelangana
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర జల వనరుల సంక్షోభం : తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది !
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment