యువతిపై కత్తితో దాడిచేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్న ప్రేమోన్మాది
السبت، 3 أكتوبر 2026
Andhra Pradesh crime New Rajarajeswaripeta area of Vijayawada Obsessed Lover Attacks Young Woman with Knife then commits suicide
విజయవాడ లోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రేమోన్మాది తన ప్రియురాలిపై కత్తితో దాడి చేసి దారుణానికి ఒడిగట్టిన అనంతరం, తాను కూడా భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నివాసముంటున్న చిన్నా (22) అనే యువకుడు, తన ప్రియురాలితో ఏర్పడిన విభేదాల కారణంగా ఆగ్రహంతో ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, మెడపై తీవ్రంగా నరికాడు. ఊహించని దాడితో తీవ్రంగా గాయపడిన ఆ యువతి రక్తమడుగులో కిందపడిపోయింది. బాధితురాలిపై దాడి చేసిన వెంటనే, చిన్నా భయంతో సమీపంలోని ఒక డాబా పైకి పరుగెత్తి అక్కడి నుంచి కిందకు దూకాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ప్రేమోన్మాది చిన్నా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు గమనించి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలిని మహాలక్ష్మి (19)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق