Travel the world
Climb the mountains
businessnationalRemoving Trade Barriers Could Unlock Huge Opportunities for Indian Companies in China’s DigitalSpace Service Sectorstechnology
వాణిజ్య ప్రతిబంధకాలను తొలగిస్తే డిజిటల్, స్పేస్ సర్వీసెస్ రంగాలలో భారతీయ కంపెనీలకు చైనాలో భారీ అవకాశాలు
చైనా మార్కెట్‌లో భారతీయ సేవల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న వ్యాపార ప్రతిబంధకాలు, ఆంక్షలపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కఠినమైన లైసెన్సింగ్ నిబంధనలు, డేటా లోకలైజేషన్, సైబర్ సెక్యూరిటీ నిబంధనలు, వీసాలు, వర్క్ పర్మిట్ల జారీలో జరుగుతున్న ఆలస్యంపై పరిశ్రమ ప్రతినిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను స్వీకరిస్తోంది. చైనా ఏటా సుమారు 300 బిలియన్ డాలర్ల సేవల దిగుమతులు చేసుకుంటుండగా అందులో భారత వాటా కేవలం 8.95 బిలియన్ డాలర్లు (2024 గణాంకాల ప్రకారం) మాత్రమే ఉండటం గమనార్హం. ఐటీ, ఐటీఈఎస్, డిజిటల్ పరిష్కారాల రంగాల్లో భారత్‌కు మంచి పట్టు ఉన్నప్పటికీ చైనాలో విధిస్తున్న స్థానిక ఆంక్షల వల్ల భారతీయ కంపెనీలు ప్రత్యక్షంగా సేవలు అందించలేకపోతున్నాయి. చాలా కంపెనీలు థర్డ్-పార్టీ ఏజెన్సీల ద్వారా మాత్రమే సేవలు అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చైనా డేటా లోకలైజేషన్, క్రాస్-బోర్డర్ డేటా ట్రాన్స్‌ఫర్ నిబంధనలతో పాటు భారత్ డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (డీపీడీపీ), చైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ లా (పీఐపీఎల్) మధ్య ఉన్న సరిపోలికలను విశ్లేషిస్తున్నారు. పరస్పర గుర్తింపు ఒప్పందాలు, సర్టిఫికేషన్ ప్రమాణాలలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడం. వీసాలు, వర్క్ పర్మిట్లు, టాలెంట్ డిప్లాయ్‌మెంట్ వ్యాపార పరమైన ప్రతిబంధకాలకంటే రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెమిటెన్సులు, ట్యాక్సేషన్, అంతర్జాతీయ కాంట్రాక్టుల లభ్యతలో ఎదురవుతున్న సవాళ్లపై స్పష్టత కోరారు. ప్రపంచ వాణిజ్యంలో భారత వాణిజ్య సర్వీసుల ఎగుమతుల వాటా 2014లోని 3% నుంచి 2024 నాటికి 4.3%కి పెరిగింది. కొవిడ్ తదనంతరం భారత సర్వీసెస్ ఎగుమతుల వార్షిక వృద్ధి రేటు 14%కి చేరింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ వాణిజ్య ప్రతిబంధకాలను తొలగిస్తే డిజిటల్, స్పేస్ సర్వీసెస్ రంగాలలో భారతీయ కంపెనీలకు చైనాలో భారీ అవకాశాలు లభించే ఆస్కారముంది.
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment