అమెరికా భూతల దాడులను తిప్పికొట్టేలా ఇరాన్‌ మహిళలకు సైనిక శిక్షణ

الاثنين، 5 أكتوبر 2026

inaugurated at Haft-e-Tir Square in Tehran international Iran has taken a crucial decision Military training for Iranian women to repel potential US ground attacks

t f B! P L

ఇరాన్ లోని టెహ్రాన్‌ హఫ్తె తిర్ స్క్వేర్‌లో మరో పౌర సైనిక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు భూతల దాడులకు దిగితే పరిస్థితులను ఎదుర్కొనేలా సాధారణ పౌరులను సిద్ధం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇప్పటిదాకా డ్రోన్లు, క్షిపణులు, వైమానిక దాడులకు పరిమితమైన యుద్ధంలో ఇప్పుడు భూతల దాడులు జరిగే అవకాశం ఉందన్న భయాలను ఇరాన్ సమాజం ఎదుర్కోంటోంది. యుద్ధ పరిస్థితులు వస్తే తమ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటే తన భయం కొంత వరకు తగ్గుతుందని భావించి శిక్షణ తీసుకున్నట్లు 45 ఏళ్ల రహేలెహ్ ఘదీరి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తమ కుటుంబాలను రక్షించుకునేందుకు మహిళలు సైనిక శిక్షణకు ముందుకొస్తున్నారు. ఇరాన్ విషయంలో అమెరికా అతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంకేతం ఇచ్చారు. ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక బలగాలను భారీగా పెంచుతోంది. నవంబర్ నాటికి సుమారు 10 వేల మంది అదనపు సైనికులను, మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌తో పాటు పలు నావికాదళ నౌకలను అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అమెరికా తర్వాతి అడుగు ఏమిటన్న దానిపై ఉత్కంఠ పెరిగింది. మరోవైపు ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అమెరికా, దాని మిత్రదేశాలకు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగితే.. గతంలో కంటే మరింత బలంగా ప్రతిఘటించి తమ దేశాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేశారు. న్యాయం, సమానత్వం ఆధారంగా జరిగే చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమని అన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ