ホーム
/
Jantar Mantar turns into a battleground; police resort to lathi-charge against protesters; area completely sealed off as a security measure.National
/
రణరంగంగా మారిన జంతర్‌మంతర్ ప్రాంగణం : నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్
Friday, October 2, 2026
'Save Democracy' High Tension in Delhi Jantar Mantar turns into a battleground; police resort to lathi-charge against protesters; area completely sealed off as a security measure.National
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమానికి ప్రతిపక్ష 'ఇండియా' కూటమి నేతలు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనలకు అనుమతి నిరాకరించడంతో జంతర్‌మంతర్ ప్రాంగణం రణరంగంగా మారింది. 'సేవ్ డెమోక్రసీ' పేరుతో చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆంక్షలను ధిక్కరించి నిరసన తెలిపేందుకు యత్నించిన ఆప్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జీ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు ప్రముఖులను, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జంతర్‌మంతర్ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా మూసివేశారు.
No comments:
Post a Comment