తెలంగాణలో పెరిగిన సన్న బియ్యం ధరలు

الاثنين، 5 أكتوبر 2026

now reached a range of ₹65 to ₹83 Rise in Fine Rice Prices in Telangana Varieties that cost between ₹50 and ₹55 per kilogram four months ago

t f B! P L

తెలంగాణలో సన్న బియ్యం ధరలు గత నాలుగు నెలల్లో భారీగా పెరిగిపోయాయి. నాలుగు నెలల క్రితం కిలోకు 50 నుంచి 55 రూపాయల మధ్య ఉన్న సన్నాలు ఇప్పుడు 65 నుంచి 83 రూపాయల వరకు చేరుకున్నాయి. తక్కువ నాణ్యత ఉన్న సన్న రకాలు కూడా 60 రూపాయలకు పైనే అమ్ముడవుతున్నాయి. నూకల ధర కూడా 20 రూపాయల నుంచి 30 రూపాయలకు పెరిగింది. మార్కెట్ లో అమ్ముడవుతున్న ప్రధాన రకాల 25 కిలోల బస్తా ధరలు చూస్తే జేఎస్‌ఆర్ ప్రీమియం రకం కిలోకు సగటున 83.50 రూపాయలు, జేఎస్‌ఆర్ రా రైస్ 74.85, లలిత సోనామసూరి 71.33, కర్నూలు సోనామసూరి 70, హెచ్‌ఎంటీ రా రైస్ 69 రూపాయలుగా ఉన్నాయి. కిరాణా దుకాణాల్లో హెచ్‌ఎంటీ రా రైస్ కిలో 78 రూపాయలకు అమ్ముతున్నారు. 15 రోజుల క్రితం ఇది 70 రూపాయలు ఉండేది. మొత్తంగా నాలుగు నెలల్లో సుమారు 25 శాతం వరకు బియ్యం ధరల పెరుగుదల నమోదైంది.ఈ పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం వరి దిగుబడి అంచనాల మేరకు రాకపోవడం ఒక ముఖ్య కారణం. గతేడాది 92.17 లక్షల ఎకరాల్లో సాగైన వరి ఈసారి 78.23 లక్షల ఎకరాలకే పరిమితం కావచ్చని అంచనాలున్నాయి. కృష్ణా బేసిన్‌లో నీటి కొరత, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వలకు నీరు సరిగా రాకపోవడంతో నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. యాసంగి సాగు పైనా అనిశ్చితి నెలకొంది. తెలంగాణలో పండే సన్న ధాన్యం నాణ్యత ఎక్కువ కావడంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వ్యాపారులు కోతలు మొదలైన వెంటనే పచ్చి ధాన్యాన్ని కొనేస్తున్నారు. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలకు భారీగా తరలిపోతుండటంతో రాష్ట్రంలో సరఫరా తగ్గుతోంది. మిల్లర్లు ఇప్పుడు నగదు చెల్లించాకే బియ్యం ఇస్తున్నారు. గతంలో రెండు నెలల గడువు ఉండేది. దీంతో రిటైల్ వ్యాపారులు కూడా ధర పెంచుతున్నారు.పౌరసరఫరాల సంస్థ గత ఖరీఫ్‌లో 72 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా 5 లక్షల టన్నులు మిగులుగా ఉండటం మార్కెట్‌లో లభ్యతను తగ్గించింది. సీఎంఆర్ పథకంలో అక్రమాలు, రీసైక్లింగ్ కూడా జరుగుతున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. మొత్తం రూ.2,000 కోట్ల విలువైన ధాన్యం మాయమైన విషయం వెల్లడైంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో బియ్యం రిటైల్ ధరలు జూలై నుంచి సెప్టెంబర్ వరకు 13.32 శాతం పెరిగాయి. ఇది దేశంలో రెండో అత్యధిక పెరుగుదల. ఎల్‌నినో భయాలతో కొంతమంది వినియోగదారులు ముందుగానే నిల్వలు చేసుకోవడం కూడా డిమాండ్ పెంచింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ