7న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం : బంగారం, వెండి ధరలకు రెక్కలు ?

الاثنين، 5 أكتوبر 2026

business GST Council Meeting with State Finance Ministers on the 7th importing gold national or platinum metals and goods into the country is required to pay 3% IGST silver Will Gold and Silver Prices Soar?

t f B! P L

అక్టోబర్ 7న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బ్యాంకులు, ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన నామినేటెడ్ ఏజెన్సీలు విలువైన లోహాల దిగుమతులపై ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ మినహాయింపు పూర్తిగా ఉపసంహరించుకునే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు సమాచారం. అదే జరిగితే బంగారం వెండి, ప్లాటినమ్ ధరలు పెరగనున్నాయి. దేశంలోకి ఎవరైనా వ్యాపారులు బంగారం, వెండి, ప్లాటినం లోహాలు, వస్తువులు దిగుమతి చేసుకుంటే 3 శాతం ఐజీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలకు ఈ పన్ను నుంచి ప్రత్యేక మినహాయింపు లభిస్తోంది కేంద్రం. దేశంలో జీఎస్టీ విధంగా అమల్లోకి వచ్చిన 2017 నుంచి వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి వ్యాపార కార్యకలాపాలు ఆటంకాలు లేకుండా సాగడానికి ఈ ప్రత్యేక వెసులుబాటును కల్పించింది. పన్ను మినహాయింపు ఎందుకు రద్దు చేయాలని భావిస్తోంది కేంద్రం. కొన్నేళ్లుగా పన్ను మినహాయింపు నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఐజీఎస్టీ మినహాయింపు రద్దు చేస్తే బులియన్ ఎక్స్ఛేంజీలు, బ్యాంకులు లేదా ఏజెన్సీలు పన్నుల చెల్లింపు విషయంలో ఓ దారికి వస్తాయి. దీనివల్ల అందరికీ ఒకే రకమైన పన్ను విధానం వర్తిస్తుందని అధికారులు అంచనా. బంగారం, వెండి దిగుమతులు కేంద్రానికి పెద్ద సవాల్‌గా మారింది. దీని కారణంగా విదేశాల నుంచి వాటిని కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున విదేశీ కరెన్సీ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా విదేశీ మారక నిల్వలపై తీవ్రమైన భారం పడుతోంది. ఆభరణాల తయారీ పరిశ్రమలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఏటా భారీ దిగుమతులు చేసుకుంటోంది భారత్. ఈ దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి అనవసరమైన కొనుగోళ్లను తగ్గించడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంది కేంద్రం. మే నెలలో బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచింది. బంగారం, వెండిపై 6 శాతం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. ప్లాటినంపై 6.4 శాతం సుంకాన్ని 15.4 శాతానికి పెంచింది. మినహాయింపు తొలగించి పన్ను వేస్తే, బంగారం, వెండి, ప్లాటినమ్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. దానివల్ల బంగారం దిగుమతులను మరింత కట్టడి చేయవచ్చని ఆ శాఖ అధికారుల అంచనా. తాజాగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే.. 2026-27 ఏప్రిల్ నుండి ఆగస్టు నెలల మధ్య దేశంలో బంగారం దిగుమతులు 3.38 శాతం మేరా పెరిగాయి. వీటి విలువ సుమారు 17.47 బిలియన్ డాలర్లు. అదే సమయంలో వెండి దిగుమతులు కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి దిగుమతులు 8.81 శాతం క్షీణించి వాటి విలువ 1.74 బిలియన్ డాలర్లకు చేరింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ