లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత : ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటన్న నందమూరి బాలకృష్ణ

Sunday, October 4, 2026

Andhra Pradesh cinema Legendary Director Singeetam Srinivasa Rao Passes Away Nandamuri Balakrishna Calls His Death an Irreparable Personal Loss telangana

t f B! P L

దశాబ్దాల క్రితమే పాన్‌ ఇండియా కు నిర్వచనం చెప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం తో అసలు సంభాషణ లేకుండా కేవలం సంగీతం ద్వారానే వెండితెరపై మరో ప్రయోగం చేశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సింగీతం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేవీరెడ్డి కాలంలో సినీ ప్రస్థానం మొదలెట్టిన సింగీతం శ్రీనివాసరావు ఇటీవల 94ఏళ్ల వయసులోనూ మెగాఫోన్‌ పట్టుకుని పట్ల తన మక్కువ చాటిచెప్పారు. చివరిదాకా వినూత్న ఆలోచనలకే కేంద్రంగా బతికిన దర్శక దిగ్గజం… దివికి ఎగిసింది. ఇన్నాళ్లు అనేక ప్రయోగాలతో వెండితెరపై అద్భుతం సృష్టించిన ఆయన ఇక సెలవంటూ అనంత లోకాలకు వెళ్లిపోయారు. సింగీతం శ్రీనివాస రావు మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మా కుటుంబానికి చాలా సన్నిహితులు. మేమిద్దరం కలిసి మూడు విభిన్నమైన క్లాసిక్ చిత్రాలను అందించాము. 'ఆదిత్య 369'; తెలుగులో మొట్టమొదటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆధారిత చిత్రమై, బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించి, జానపద చిత్రాలలో ఇప్పటికీ తిరుగులేనిదిగా నిలిచిన 'భైరవ ద్వీపం'; పౌరాణిక చిత్రం 'శ్రీ కృష్ణార్జున విజయం'. ఈ మూడు చిత్రాల ద్వారా, ఒకే దర్శకుడి సారథ్యంలో నేను సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక అనే నాలుగు ప్రధాన జానర్‌లలోని పాత్రలను పోషించాను. ఆ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరచిపోలేను. మా నాన్నగారు తొలిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన చిరస్మరణీయ చిత్రం 'మాయాబజార్' కోసం గొప్ప దర్శకుడు కె.వి. రెడ్డి గారి వద్ద సింగీతం గారు సహాయకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత, ఆయన మా నాన్నగారి అనేక చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారు. అందువల్ల, మా కుటుంబానికి ఆయనతో అతీతమైన ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. సింగీతం గారు అన్ని విధాలా అసలు సిసలు దిగ్గజ దర్శకుడు. ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి శ్వాస వరకు వివిధ భారతీయ భాషలలో మరపురాని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు, భారతీయ చిత్ర పరిశ్రమకు పూడ్చలేని నష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సింగీతం గారి కుటుంబ సభ్యులకు మా నందమూరి కుటుంబం పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. "ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారి మృతి అత్యంత బాధాకరం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు దిక్సూచిగా మారారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సింగీతం గారు భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అంటూ ట్వీట్ చేశారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ