రాజ్యసభ బీజేపీ అభ్యర్థుల ప్రకటన : ఉత్తరాఖండ్ నుంచి దినేష్ ఆర్య, పశ్చిమ బెంగాల్ నుంచి రుక్మిణి మల్లిక్
Sunday, October 4, 2026
Announcement of BJP Rajya Sabha Candidates Dinesh Arya from Uttarakhand national Rukmini Mallick from West Bengal scheduled for October 16
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం దినేష్ ఆర్యను, అలాగే పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నిక కోసం ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు రుక్మిణి మల్లిక్‌ను పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. దినేష్ ఆర్య ఉత్తరాఖండ్ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీలకంగా పనిచేస్తున్న అంకితభావం గల అభ్యర్థిగా ఆయనకు గుర్తింపు ఉంది. రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఈ స్థానాన్ని పార్టీ సులభంగా దక్కించుకునే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని రాజ్యసభ ఉపఎన్నిక కోసం రుక్మిణి మల్లిక్ అలియాస్ కోయెల్ మల్లిక్‌ను బీజేపీ బరిలోకి దింపింది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోయెల్ మల్లిక్, ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆమెకు బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నది. అక్టోబర్ 16న జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది.
No comments:
Post a Comment