తిరువనంతపురం కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేసిన ఆర్‌. శ్రీలేఖ

Sunday, October 4, 2026

kerala national R. Sreelekha Resigns as Councilor in Thiruvananthapuram Corporation suffered a setback from one of its own leaders just months after its victory

t f B! P L

కేరళ లోని  తిరువనంతపురం కార్పొరేషన్‌లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీకి గెలిచిన కొన్ని నెలల్లోనే సొంత పార్టీ నేత నుంచి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ డీజీపీ, కేరళ తొలి మహిళా ఐపీఎస్‌ అధికారి ఆర్‌. శ్రీలేఖ కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. శాస్తమంగళం వార్డు నుంచి బీజేపీ తరఫున శ్రీలేఖ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికలకు ముందు నుంచే ఆమెను పార్టీ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా ప్రొజెక్ట్‌ చేస్తారనే ప్రచారం జరిగింది. పార్టీ నాయకత్వం కూడా తనను తిరువనంతపురంలో బీజేపీ ముఖంగా నిలబెడతామని, మేయర్‌ పదవికి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీలేఖ గతంలో వెల్లడించారు. అయితే బీజేపీ చివరకు వీవీ రాజేశ్‌ను మేయర్‌గా ఎంపిక చేసింది. దీంతో శ్రీలేఖ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. మొదట్లోనే కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపలేదని, పార్టీ నేతలు పలుమార్లు కోరడంతోనే బరిలోకి దిగినట్లు ఆమె చెప్పుకొచ్చారు. మేయర్‌ పదవి దక్కకపోయినా పార్టీ నిర్ణయాన్ని అంగీకరించినట్లు గతంలో శ్రీలేఖ ప్రకటించారు. ప్రజలు తనపై నమ్మకంతో ఓటు వేశారని, వారి కోసం కౌన్సిలర్‌గా కొనసాగుతానని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను మేయర్‌ వీవీ రాజేశ్‌కు అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌కు కూడా కాపీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే కార్పొరేషన్‌ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించిన తర్వాతే అది అధికారికంగా అమల్లోకి వస్తుంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ