అమెరికాలో ఆలయంపై దాడి : దాడి జరిగినప్పుడు ఆలయంలో పూజారులు, భక్తులు : కిటికి అద్దాలు ధ్వంసం
Sunday, October 4, 2026
Attack on US Temple Miscreants vandalized a Hindu temple in the Greater Cleveland area of Ohio Priests and Devotees Present During Incident Windowpanes Shattered
అమెరికాలోని ఒహియో రాష్ట్రం గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలో ఉన్న ఓ హిందూ దేవాలయంపై దుండగులు ఇటుకలతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రిచ్మండ్ హైట్స్‌లో ఉన్న స్వామినారాయణ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడటంతో కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయని అమెరికాకు చెందిన రెండు హిందూ సంస్థలు ఆరోపించాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్టు 'హిందూ అమెరికన్ ఫౌండేషన్' (హెచ్ఏఎఫ్), కోయాలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా(సీఓహెచ్ఎన్ఏ) చెప్పాయి. దాడి జరిగినప్పుడు ఆలయంలో పూజారులు, భక్తులు ఉన్నట్టు కోహ్నా సీఓహెచ్ఎన్ఏ పేర్కొంది. ''హిందూ హెరిటేజ్ మంత్ వేడుకలు ప్రారంభమవుతుండటంతో రాబోయే 10 రోజులు నవరాత్రులను ఘనంగా జరుపుకోవడానికి తాము సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది'' అని ఆ సంస్థ 'ఎక్స్'లో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తరహా మతదురహంకారాన్ని తీవ్రంగా ఖండించాలని స్థానిక మేయర్ కిమ్ థామస్‌ను కోరింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశీలిస్తున్నట్టు హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెల్లడించింది. దోషులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సివిల్ రైట్స్ డివిజన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. అలాగే, భారతీయ, హిందూ అమెరికన్ సమూహాలపై జరుగుతున్న ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రభుత్వ సంస్థలు, ఎన్నికైన ప్రతినిధులు బహిరంగంగా ఖండించాలని విజ్ఞప్తి చేసింది.
No comments:
Post a Comment