నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీపై సర్వోత్తం రెడ్డి అనాసక్తి ?

Friday, October 2, 2026

Is Sarvotham Reddy Reluctant to Contest the Nalgonda-Khammam-Warangal Graduate Constituency Election?.telangana uryapet constituency in the upcoming Assembly elections

t f B! P L

తెలంగాణలోని నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన పోటీకి విముఖత చూపుతున్నారనే ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రాడ్యుయేట్‌ టికెట్‌ కోసం తాను ఎవరినీ అడగలేదని, పోటీ చేయాలని పార్టీ పెద్దలు తనను సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తన ప్రమేయం లేకుండానే అభ్యర్థిగా ప్రకటించడంపై సర్వోత్తం పార్టీకి చెందిన కీలక నేతలను కలిసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న తన ఆకాంక్షను కూడా ఆయన వారి వద్ద వెల్లడిస్తున్నట్లు సమాచారం. సహజంగా అధికార పార్టీ టికెట్‌ కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతుంటారు. అభ్యర్థిత్వం కోసం లాబీయింగ్‌ చేస్తుంటారు. అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి కాంగ్రెస్‌లో నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాతే.. తనకు పోటీపై ఆసక్తి లేదంటూ అభ్యర్థి వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ ఖరారు చేసింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానానికి సామ రామ్మోహన్‌ రెడ్డి, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, జాబితాలో తన పేరు ఉండటంతో సర్వోత్తం రెడ్డి కంగుతిన్నట్లు సమాచారం. తాను పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని, టికెట్‌ కోసం ఎవరినీ సంప్రదించలేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. తనను సంప్రదించకుండానే అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన అయోమయానికి గురైనట్లు సమాచారం. దీంతో పార్టీకి చెందిన కీలక నేతలను కలిసి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేనని తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయిష్టంగా ఉన్న సర్వోత్తం.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలన్న తన మనసులోని మాటను పార్టీ కీలక నేతల వద్ద వెల్లడిస్తున్నట్లు సమాచారం. దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి కుమారుడైన సర్వోత్తం.. తన తండ్రికి రాజకీయ అనుబంధం ఉన్న సూర్యాపేట నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని ఆయన చెబుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ, ప్రభుత్వంలోని కీలక నేతలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రుల వద్ద కూడా సర్వోత్తం ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్నారనే అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ