కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'ఇండి' కూటమి ఇచ్చిన సేవ్ డెమోక్రసీ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం చలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దేశంలోని 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా పేర్లు డ్రాఫ్ట్ రోల్స్ నుంచి తొలగించడం సరికాదన్నారు. ఓటర్లను తొలగించడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. 'సర్' ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించడం లేదన్నారు. స్థానిక ఓటర్ల నమోదు అధికారుల అధికారాలను బలహీనపరిచేలా ఈసీనెట్ వ్యవస్థను వినియోగించారని, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించకుండా అధికార పక్షానికి కొమ్ముకాసేలా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందున సీఈవో జ్ఞానేశ్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలని, అంతవరకు తమ పోరాటం ఆగదని మంత్రి పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు. లోక్‌భవన్ వద్ద ఆందోళనకు దిగిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో లోక్‌భవన్‌కు కాంగ్రెస్, టీజేఏస్, లెఫ్ట్ పార్టీలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చాయి. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, 'ఇండి' కూటమి రాష్ట్ర నేతలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్ నుంచి లోక్‌భవన్ వైపు ర్యాలీగా బయలుదేరిన నేతలను అడ్డుకున్నారు. లోక్‌భవన్‌కు 300 మీటర్ల దూరంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు దేశవ్యాప్తంగా 'ఇండి' కూటమి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
సేవ్ డెమోక్రసీ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ ర్యాలీ
Thursday, October 8, 2026
'Chalo Lok Bhavan' rally held under TPCC aegis as part of the 'Save Democracy' call Struggle to Continue Until Gyanesh Resigns telangana

No comments:
Post a Comment