Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్షాలు, విద్యార్ధి సంఘాలు చేపట్టిన నిరసన కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో నిరసనల్ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నిరసనకు హాజరయ్యేందుకు వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కేను పోలీసులు విమానంలోనే అరెస్టు చేశారు. ఆయనతో పాటు పలువురు సీజేపీ ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ఛీఫ్ అభిజీత్ దీప్కే ఉదయం ముంబై నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఈ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగకముందే అందులోకి పోలీసులు ప్రవేశించారు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసనకు ముందు పోలీసులు విమానంలోకి ప్రవేశించి తనను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను దీప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రసారం చేశారు. తనతో పాటు ఇతర సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానం నుంచే అదుపులోకి తీసుకుంటుండగా, ఢిల్లీ పోలీసు బృందం విమానంలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలను చూపిస్తూ దీప్కే ఆ వీడియోను పోస్ట్ చేశారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement