Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు మద్దతుగా సుప్రీంకోర్టు లాయర్లు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్న ఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ప్రాంగణ సమీపంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు బలప్రయోగానికి పాల్పడి వారిని అదుపులోకి తీసుకున్నారని బార్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అక్రమ నిర్బంధాలపై భారత ప్రధాన న్యాయమూర్తి తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదుపులోకి తీసుకున్న ప్రతి న్యాయవాది ఎక్కడ ఉన్నారో గుర్తించి, వారి భద్రతకు భరోసా కల్పించాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కోరింది. న్యాయ సహాయం అందుబాటులోకి తీసుకురావాలని, చట్టబద్ధమైన కారణాలు లేకుండా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేసేలా సీజేఐ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అలాగే న్యాయవాదులను నిర్బంధించిన పరిస్థితులు, వారిపై జరిగినట్లు చెబుతున్న బలప్రయోగంపై సమగ్రంగా విచారణ జరపాలని అసోసియేషన్ కోరింది. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ఈ తీర్మానం ప్రతిని అత్యవసర పరిశీలన కోసం భారత ప్రధాన న్యాయమూర్తికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి ప్రజ్ఞా బాఘేల్ ఈ తీర్మానాన్ని విడుదల చేశారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement