ఆసియా గేమ్స్ 2026లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. విశ్వవేదికపై సత్తా చాటి రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టారని కొనియాడారు. పతక విజేతలు బుధవారం సీఎం చంద్రబాబు నాయుడిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు సాధించిన పతకాలు, వారి అత్యుత్తమ ప్రదర్శనను చంద్రబాబు ప్రత్యేకంగా కొనియాడారు. అంతర్జాతీయ వేదికలపై ఏపీ పేరును నిలబెట్టిన క్రీడాకారుల ప్రతిభను అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో మహిళా క్రికెటర్ శ్రీ చరణి, ఆర్చర్లు గణేష్ మణిరత్నం, ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతి సురేఖ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు 3 రకాల క్రీడల్లో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలను సాధించారని చంద్రబాబుకు శాప్ ఎండీ భరణి తెలియజేశారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం తరఫున పూర్తి ప్రోత్సాహం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. స్వర్ణం గెలిచిన మహిళా క్రికెట్ టీమ్‌లో కడపకు చెందిన శ్రీచరణి భాగంగా ఉండగా.. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం సాధించింది . రాజమండ్రికి చెందిన గణేష్ మణిరత్నం పురుషుల కాంపౌండ్ టీమ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీ కేటగిరిలో కాంస్య పతకం సాధించాడు. విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రీకర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకం, పురుషుల రీకర్వ్ టీమ్ ఈవెంట్‌లో మరో రజత పతకం సాధించాడు.
Post Top Ad
Responsive Ads Here
الأربعاء، 7 أكتوبر 2026
Home
Andhra Pradesh
Asian Games Medalists Meet CM Chandrababu
Government Promises Full Support and Necessary Infrastructure
sports
సీఎం చంద్రబాబును కలిసిన ఆసియా గేమ్స్ విజేతలు : ప్రభుత్వం తరఫున పూర్తి ప్రోత్సాహం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తాం
సీఎం చంద్రబాబును కలిసిన ఆసియా గేమ్స్ విజేతలు : ప్రభుత్వం తరఫున పూర్తి ప్రోత్సాహం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తాం
Tags
# Andhra Pradesh
# Asian Games Medalists Meet CM Chandrababu
# Government Promises Full Support and Necessary Infrastructure
# sports
Share This
About Telugu Lo Computer
sports
in
Andhra Pradesh,
Asian Games Medalists Meet CM Chandrababu,
Government Promises Full Support and Necessary Infrastructure,
sports
الاشتراك في:
تعليقات الرسالة (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.

ليست هناك تعليقات:
إرسال تعليق