ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బొమ్మరాజు చెరువు సమీపంలోని కావలి-దుత్తలూరు జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.కలిగిరి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న నారాయణ విధులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామమైన వింజమూరుకు బయలుదేరారు. బొమ్మరాజు చెరువు సమీపానికి చేరుకున్న సమయంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో కలిగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఐస్‌క్రీమ్ వ్యాపారం నిర్వహించుకుని మూడు చక్రాల వాహనంపై వింజమూరు వైపు వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై పడివున్న బైక్‌ను గమనించకపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న నారాయణతో పాటు ఐస్‌క్రీమ్ వాహనం నడుపుతున్న వ్యక్తికి రక్తగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వింజమూరు నుంచి కలిగిరి వైపు వస్తున్న కలిగిరి ఎస్సై ఘటనను గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నారు.రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్రమబద్ధీకరించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
కావలి-దుత్తలూరు హైవేపై ప్రమాదం : ఇద్దరికి తీవ్ర గాయాలు
الأربعاء، 7 أكتوبر 2026
Accident on Kavali-Duttalur Highway Andhra Pradesh near Bommaraju Cheruvu in Kaligiri Mandal Sri Potti Sriramulu Nellore district Two Sustain Serious Injuries

ليست هناك تعليقات:
إرسال تعليق