Saturday, October 17, 2026

అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం

ఆదిలాబాదు పట్టణంలోని అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు గంట పాటు శ్రమించిమంటలను అదుపు చేశారు. దారం తయారు చేసే మిషనరీ లో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగడంతో ప్లాంట్లో ఘట్టమైన పొగ కమ్ముకొనడంతో అక్కడ పనిచేసే కార్మికులు పరుగులు తీశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు, నష్టం అంచనా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.