భూ రికార్డుల్లో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేలా చర్యలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Monday, October 5, 2026

Accuracy in Land Records District In-charge Minister Jupally Krishna Rao Measures to Ensure Transparency Minister Ponguleti Srinivasa Reddy telangana

t f B! P L

తెలంగాణలోని  నిర్మల్ జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల పనితీరు, భూ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. భూ రికార్డుల్లో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలు చిన్నచిన్న సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయాలని అన్నారు. భూ వివాదాలు, హక్కుల నమోదు, రికార్డుల మార్పులు, భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా అధికారులు పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని, ప్రజలకు రెవెన్యూ సేవలు వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల మంజూరు, నిర్మాణాల పురోగతిపై కూడా మంత్రి సమీక్షించారు. ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నిర్మాణాలు ప్రారంభం కాని ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వివిధ దశల్లో నిలిచిపోయిన గృహ నిర్మాణాలను గుర్తించి, సమస్యలను పరిష్కరించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని తెలిపారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలతో పాటు అవసరమైన చోట అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రతి శాఖ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ కె. హరిత, మంచిర్యాల అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ