ホーム
/
technology
/
స్పేస్ ఎక్స్ రాకెట్‌లో నలుగురు వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పంపిన నాసా
الجمعة، 2 أكتوبر 2026
four-member crew will spend six months aboard the ISS international NASA Sends Four Astronauts to the International Space Station via SpaceX Rocket science technology
స్పేస్ ఎక్స్ రాకెట్‌లో నాసా నలుగురు వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పంపించింది. కేప్ కానవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీరున్న స్పేస్ ఎక్స్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇంధన వ్యవస్థ లీకేజీ కారణంగా మూడు వారాలు ఆలస్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి జెస్సికా వాట్కిన్స్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐఎస్‌ఎస్‌లోకి ఆమె వెళ్లడం ఇది రెండోసారి. అదేవిధంగా, కక్ష్యలోకి వెళ్లే వ్యోమగాములకు నల్లజాతి మహిళ కమాండర్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఈ నలుగురూ ఆరు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో గడుపుతారు. ఇప్పటికే అక్కడున్న నలుగురు వ్యోమగాములు తిరిగి భూమిపైకి వస్తారు. వాట్కిన్స్ మొదటిసారి 2022లో దీర్ఘకాలంపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. జియాలజిస్ట్ అయిన వాట్కిన్స్‌కు దశాబ్దం క్రితం నాసా చేపట్టిన క్యూరియాసిటీ రోవర్ కార్యక్రమంతోనూ సంబంధముంది. ఈమె సారథ్యంలో గురువారం వెళ్లిన వారిలో రిటైర్డ్ మెరైన్ ల్యూక్ డెలానీ, కెనడాకు చెందిన ఆర్మీ అధికారి జోషువా కుట్రిక్, రష్యా వాసి సెర్గీ టటెర్యాట్నికోవ్ ఉన్నారు. కాగా, నాసా కోసం స్పేస్ ఎక్స్ చేపట్టిన 13వ మిషన్ ఇది. వాట్కిన్, ఆమె బృందం లక్కీ 13 అనే నంబర్ ప్లేట్లు కలిగిన నల్ల టెస్లా కారులో లాంఛ్‌పాండ్ వద్దకు చేరుకున్నారు. వ్యోమగాముల్లో కెనడాకు చెందిన కుట్రిక్ భార్య హీథర్ నవంబర్‌లో మూడో బిడ్డకు జన్మనివ్వ నున్నారు. ఆ సమయానికి కుట్రిక్ తన కుటుంబం నుంచి దూరంగా ఉంటారు. అందుకే, కుట్రిక్ ఐఎస్‌ఎస్ నుంచే భార్యతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇలా, అంతరిక్షంలో ఉండగానే తండ్రవుతున్న వ్యోమగాముల్లో కుట్రిక్ నాలుగో వ్యక్తిగా నిలుస్తారు.
ليست هناك تعليقات:
إرسال تعليق