ఆసియా క్రీడలు : మహిళల హాకీలో భారత్ స్వర్ణ పతకం : ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించిన భారత్

الجمعة، 2 أكتوبر 2026

Asian Games First Gold in 44 Years India Wins Gold in Women's Hockey national Qualifies for Olympics sports This is India's 16th gold medal at the Asian Games

t f B! P L

జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్ స్వర్ణ పతకం సాధించింది. 1982 తర్వాత ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. 2024 పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో రజత పతకం సాధించిన చైనాతో భారత్ తలపడి పటిష్టమైన డిఫెన్స్‌ను ప్రదర్శించి 1-0 తేడాతో విజయం సాధించింది. 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 16వ స్వర్ణ పతకం. ఫైనల్‌లో భారత్ తరఫున లాల్‌రెమ్సియామి హమర్‌జోటే ఏకైక గోల్ సాధించింది. ఆమె మ్యాచ్ మొదటి క్వార్టర్‌లోని 10వ నిమిషంలో ఈ గోల్ చేసింది. 2017లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన లాల్‌రెమ్సియామి హమర్‌జోటేకు ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్. ఫుట్‌బాల్‌లోని పెనాల్టీ మాదిరిగానే, మ్యాచ్ 23వ నిమిషంలో చైనాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. భారత గోల్ కీపర్ సవిత పునియా ఆ పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకుంది. ఈ మ్యాచ్‌లో చైనా జట్టు తమ శక్తిమేర ప్రయత్నించినా గెలవలేకపోయింది. చివరి నాలుగు నిమిషాల్లో వారు తమ గోల్ కీపర్‌ను బయటకు పంపి స్ట్రైకర్‌ను రంగంలోకి దించారు. పదకొండు మంది ఆటగాళ్లు దాడి చేస్తున్నప్పటికీ, భారత్ వారికి గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో చైనాకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించినప్పటికీ.. వాటిలో దేనినీ గోల్‌గా మలచడంలో విఫలమైంది. మరోవైపు భారత్‌కు కేవలం ఒక్కటి మాత్రమే లభించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడంతో భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ