.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} ప్రియురాలిని హత్య చేసి, కాలువలో దూకిన ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడు-LATEST NEWS AP TO TG ప్రియురాలిని హత్య చేసి, కాలువలో దూకిన ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడు-LATEST NEWS AP TO TG
W T F

ప్రియురాలిని హత్య చేసి, కాలువలో దూకిన ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడు

الخميس، 8 أكتوبر 2026

​​Andhra Pradesh crime extramarital affair VIJAYAWADA Young man attempts suicide after murdering lover and jumping into a canal

t f B! P L

విజయవాడలో పెళ్లై కేవలం 35 రోజులు మాత్రమే అయిన యువకుడు తన గతంలోని వివాహేతర సంబంధాన్ని వీడలేక మహిళను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ దుర్గాఅగ్రహారానికి చెందిన నాగరాజు (31) స్థానికంగా పునుగుల బండి వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతని తండ్రి మృతి చెందాడు. తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్న నాగరాజు ఇంట్లోకి ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ కుటుంబం మూడేళ్ల క్రితం అద్దెకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని వివాహిత మహిళతో నాగరాజుకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. నాగరాజుకు 35 రోజుల క్రితం వివాహం జరిగింది. అతని భార్య 16 రోజుల పండగ కోసం పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో నాగరాజు మరోసారి తన పాత సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళను తమ ఇంట్లోనే అద్దెకు రావాలని నాగరాజు ఒత్తిడి చేసినట్లు సమాచారం. అయితే అతని ఉద్దేశాన్ని గ్రహించిన ఆమె అందుకు నిరాకరించింది. ప్రియురాలు తనకు దూరంగా ఉండటంతో నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి తీసుకురావడానికి కూడా అతడు ఆసక్తి చూపలేదు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడకుండా తప్పించుకు తిరిగేవాడని సమాచారం. రెండు రోజుల క్రితం నాగరాజు మామ స్వయంగా తన కుమార్తెను తీసుకొచ్చి అతని ఇంట్లో దింపారు. అయినప్పటికీ నాగరాజు ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నాగరాజు పక్కనే ఉన్న డాబా నుంచి ఆమె ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. తనతో మాట్లాడాలని ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించడంతో కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నాగరాజు తనను తాను గాయపరుచుకుని రక్తపు మరకలతో సమీపంలోని రైవస్ కాలువ వైపు పరుగెత్తి అందులోకి దూకాడు. నాగరాజు కాలువలోకి దూకడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కాలువలోకి దిగి అతడిని బయటకు తీసుకొచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స, శస్త్రచికిత్స నిర్వహించగా ప్రస్తుతం నాగరాజు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అతడు కోలుకున్న తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హత్యకు గురైన మహిళకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు చిన్నారులు పాఠశాలకు వెళ్లారు. తల్లి చనిపోయిన విషయం తెలియక సాయంత్రం ఇంటికి చేరుకున్న వారు అక్కడ భారీగా జనం గుమిగూడి ఉండటాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో తల్లి మృతదేహాన్ని చూసిన చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది.

tag

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ