హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, కళింగ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటైన *జాతీయ చేనేత మరియు పట్టు వస్త్ర ప్రదర్శన ను *మిస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ విజేత క్రొవ్విడి శ్రీ లహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలు లో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులను తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు. చేనేత ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదని, నేటి తరం యువత కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని శ్రీ లహరి అన్నారు. నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 11వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 74 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు.
హైదరాబాద్ లో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం!
الثلاثاء، 6 أكتوبر 2026
inaugurated Krovvidi Sri Lahari National Handloom Exhibition Inaugurated in Hyderabad telangana winner of the 'Miss Strong and Beautiful' title

ليست هناك تعليقات:
إرسال تعليق