తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారడం అత్యంత సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కండ్ల ముందే ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి జూరాల నీటిని విడుదల చేయాలని ఆందోళన చేపట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై గురువారం ఎక్స్ వేదికగా హరీశ్ రావు స్పందించారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతుంటే కడుపు మండి రోడ్డెక్కిన రైతులపై అధికారులతో, ఇంజనీర్లతో కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని హరీశ్ రావు దుయ్యబట్టారు. పోలీసులను ప్రయోగించి రైతులను భయబ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన ప్రజాపాలన అని ప్రశ్నించారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు పుష్కలంగా ఉన్నప్పుడు నీటిని ఎత్తిపోయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారని, నీటిని ఒడిసిపట్టుకోకుండా విడిచిపెట్టి తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం జలద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తప్పు చేస్తే దానికి శిక్ష రైతులు అనుభవించాలా అని నిలదీశారు. సాగునీరు అందక, సరైన కరెంట్ లేక రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఆందోళనలు చేస్తుంటే.. వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కేసులు పెట్టడం ప్రజాపాలన కాదని "ప్రజా పీడన" అని దుయ్యబట్టారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం తన రైతు వ్యతిరేక చర్యలను ఇలాగే కొనసాగిస్తే, రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
జూరాల రైతులపై కేసులు ఎత్తివేయాలి : ఎక్స్ వేదికగా హరీశ్ రావు డిమాండ్
الخميس، 8 أكتوبر 2026
Cases against Jurala farmers must be withdrawn Harish Rao demands via X shameful that handcuffing farmers and filing illegal cases telangana

ليست هناك تعليقات:
إرسال تعليق