ఇన్‌స్టాగ్రామ్ గర్ల్స్ కోసమే : ఎలాన్ మస్క్ కామెంట్స్ వైరల్

Sunday, October 4, 2026

If Instagram is for girls Musk responds to a user's post calling it a "female app" technology then who is X for? this is not the first time Musk has made such comments about Instagram

t f B! P L

'ఫీమేల్ యాప్' అంటూ యూజర్ పోస్ట్ కు స్పందించిన మస్క్ ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌ను 'ఫీమేల్ యాప్'గా పేర్కొంటూ తాను ఆ యాప్‌ను డిలీట్ చేసినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్.. 'ఇన్‌స్టాగ్రామ్ గర్ల్స్ కోసమే' అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కేవలం మహిళల కోసం మాత్రమే కాదని, అన్ని జెండర్లకు చెందిన వారు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారని పలువురు కామెంట్లు చేశారు.  మస్క్ వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులు, స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. దీంతో 'ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిలదైతే ఎక్స్ ఎవరిది?' అంటూ కొందరు నెటిజన్లు మస్క్‌ను ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌పై మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలోనూ ఆయన ఇదే తరహాలో స్పందించినట్లు సమాచారం.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ