Sunday, October 18, 2026

హార్ముజ్ జలసంధి సమీపంలో కార్గో నౌక బోల్తా : తీరానికి కొట్టుకొచ్చిన ఐఫోన్ల కోసం ఎగబడ్డ జనం

హార్ముజ్ జలసంధి సమీపంలో రెండు రోజుల క్రితం ఒక సముద్రపు మైన్ ను ఢీకొట్టడంతో ఒక భారీ కార్గో నౌక బోల్తా పడిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఓడలో ఉన్న ఖరీదైన ఐఫోన్లు, బ్రాండెడ్ పర్ఫ్యూమ్ బాటిళ్లు పెద్ద యెత్తున సముద్రంలో పడిపోతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కాగా, తాజాగా ఆ ఐఫోన్ల పెట్టెలు, ఇతర సరుకులు కొట్టుకుంటూ సముద్ర తీరానికి చేరుకోవడంతో, వాటిని సొంతం చేసుకునేందుకు స్థానిక జనం వేలాదిగా తీరానికి ఎగబడ్డ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తీరంలో ఐఫోన్ల కోసం ప్రజలు పోటీపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతుండటంతో అంతర్జాతీయ మీడియా ఈ ఘటనపై దృష్టి సారించింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలలో చాలావరకు కృత్రిమ మేధస్సు  ద్వారా సృష్టించబడిన ఫేక్ వీడియోలని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, హార్ముజ్ జలసంధిలో కార్గో షిప్ ప్రమాదానికి గురై మునిగిపోవడం, అందులోని ఐఫోన్లు మరియు ఇతర ఖరీదైన సరుకులు సముద్రం పాలు కావడం మాత్రం వాస్తవమేనని ధృవీకరించాయి.