'రామాయణ' మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం : దెబ్బతిన్న ఎలక్ట్రిక్ వైరింగ్, ఇతర విద్యుత్ పరికరాలు, కేబుల్స్

Monday, October 5, 2026

and Cables Damaged cinema Electrical Wiring Equipment Fire at 'Ramayana' Movie Set maharashtra Mumbai Film City

t f B! P L

ముంబై ఫిల్మ్ సిటీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 'రామాయణ' సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా పొగ వ్యాపించింది. దీంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈరోజు సాయంత్రం 4.02 గంటలకు ఫిల్మ్ సిటీలోని గోరేగావ్ ఈస్ట్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు ముంబై ఫైర్ బ్రిగేడ్ తెలిపింది. రిలయన్స్ మీడియా వర్క్స్, ప్రైమ్ ఫోకస్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సెట్‌లో మంటలు చెలరేగాయి. సుమారు 100x20 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెట్‌లోని పీసీఆర్ యూనిట్‌లో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. మంటల కారణంగా ఎలక్ట్రిక్ వైరింగ్, ఇతర విద్యుత్ పరికరాలు, కేబుల్స్ దెబ్బతిన్నాయి. అలాగే తలుపులు, చెక్క పలకలు, ఏసీ యూనిట్లు, వెదురు, ప్లాస్టిక్ సామగ్రి, సౌండ్ సిస్టమ్స్, షూటింగ్‌కు ఉపయోగించే పరికరాలు కాలిపోయినట్లు ముంబై ఫైర్ బ్రిగేడ్ వెల్లడించింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు, బీఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 108 అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచారు. ఫైర్ సిబ్బంది దాదాపు 50 నిమిషాల పాటు శ్రమించి సాయంత్రం 4.55 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. 'రామాయణం' షూటింగ్‌కు మాత్రమే కాకుండా సమీపంలోని మరికొన్ని షూటింగ్స్‌కు కూడా ఈ ఘటనతో అంతరాయం ఏర్పడింది. 'MTV Hustle 5', 'Pati Patni Aur Panga 2' షూటింగ్స్ కూడా సమీపంలోని స్టూడియోల్లో జరుగుతున్నాయి. ప్రారంభ సమాచారం ప్రకారం 'Pati Patni Aur Panga 2' సెట్‌లో మంటలు మొదలై, ఆ తర్వాత 'Hustle 5' సెట్ వైపు వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సెట్లకు ఎంతమేర నష్టం జరిగిందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ