ఉదయ్‌పూర్ - సూరత్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లు రువ్విన దుండగులు : ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్

గుజరాత్‌లోని సూరత్ సమీపంలో వేగంగా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఉదయ్‌పూర్ - సూరత్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై జరిగిన ఈ రాళ్ల దాడిలో రైలు కిటికీ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి రైల్వే రక్షణ దళం ముగ్గురు నిందితులను ఇవాళ అరెస్ట్ చేసింది.  సూరత్ - ఉత్త్రాన్ రైల్వే స్టేషన్ల మధ్య వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ C-6 కోచ్, పాంట్రీ ప్రాంతంపై దుండగులు రాళ్లు విసరడంతో మూడు గాజు ప్యానెళ్లు, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, రైల్వే సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఆర్పీఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. రైలుపై రాళ్ల దాడి జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన ఆర్పీఎఫ్ సిబ్బంది, నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో నిందితులు కేవలం సరదా కోసమే కదులుతున్న రైలుపై రాళ్లు విసిరినట్లుగా ఒప్పుకున్నట్లుగా అధికారులు తెలిపారు. నిందితులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆర్పీఎఫ్ వెల్లడించింది.

إرسال تعليق

أحدث أقدم
3