ఏషియన్ గేమ్స్ : మహిళల టీమ్ రికర్వ్ ఆర్చరీలో స్వర్ణం, మెన్స్‌ స్కిఫ్‌ విభాగంలో రజత పతకం

Friday, October 2, 2026

Ankita Bhakat Asian Games Gold in Women's Team Recurve Archery Keerthi Kumkum Anil Mohod Manu Francis Prince Kurisinkal Noble national Silver in Men's Skiff sports

t f B! P L

జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో మహిళల టీమ్ రికర్వ్ ఆర్చరీలో భారత్ మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పదిసార్లు ఒలింపిక్ ఛాంపియన్లుగా నిలిచిన కొరియాజట్టును ఓడించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత మహిళల జట్టు చైనాపై 5-1తో ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు ఫైనల్ లో దక్షిణ కొరియాను ఓడించింది. అంకితా భకత్, కీర్తి, కుంకుమ్ అనిల్ మొహోద్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ఫైనల్‌లో దక్షిణ కొరియాను 5-3 తేడాతో ఓడించి చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఏషియన్ గేమ్స్ 2026లో ఆర్చరీలో భారత్ ఇప్పటికే అద్భుత ప్రదర్శన చేసింది. సెప్టెంబర్ 30న జరిగిన కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లలో భారత్ మహిళల, పురుషుల, మిక్స్‌డ్ విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. మహిళల కాంపౌండ్ జట్టు చైనాను 238-234తో ఓడించి స్వర్ణం గెలవడమే కాకుండా ప్రపంచ రికార్డును సమం చేసింది. పురుషుల జట్టు చైనాపై 238-237తో, మిక్స్‌డ్ జట్టు దక్షిణ కొరియాపై షూట్‌ఆఫ్‌లో విజయం సాధించాయి.

అలాగే ఇండియన్‌ సెయిలర్లు మెరిశారు. మెన్స్‌ స్కిఫ్‌ విభాగంలో మను ఫ్రాన్సిస్‌-ప్రిన్స్‌ కురిసింకల్‌ నోబుల్‌ రజత పతకం కైవసం చేసుకుంది. మొత్తం 9 రేసుల తర్వాత ఇండియన్‌ జోడీ 23 పాయింట్లుసాధించారు. వెన్‌ జైడింగ్‌-లియు టియాన్‌తో కూడిన చైనా 16 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకుంది. స్కిఫ్‌ సెయిలింగ్‌లో పాయింట్లు ప్రతి రేసులో ముగింపు స్థానం (ఫినిష్‌ పొజిషన్‌) ఆధారంగా నిర్ణయిస్తారు. తొలి స్థానంలో నిలిస్తే మొత్తం స్కోరులో ఒక్క పాయింట్‌ లభిస్తుంది. ఈ పోటీలో ఇండియన్స్‌ రేస్‌-3లో విజయం సాధించగా, రేస్‌-1, 5, 9లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఫ్రాన్సిస్‌-ప్రిన్స్‌ ముంబైలోని ఆర్మీ యాచింగ్‌ నోడ్‌లో శిక్షణ పొందారు. విమెన్స్‌ స్కిఫ్‌లో హర్షిత తోమర్‌-శీతల్‌ వర్మ బృందం కాంస్యాన్ని గెలుచుకుంది. 9 రేసుల తర్వాత హర్షిత-శీతల్‌ 24 నెట్‌ పాయింట్లతో కలిపి 28 పాయింట్లు సాధించారు. రేస్‌-2, 6, 8లో మూడుసార్లు అనర్హతకు గురైన చైనా కంటే ఇండియన్స్‌ మెరుగైన ప్లేస్‌లో నిలిచారు. జపాన్‌ (14), హాంకాంగ్‌ (18) వరుసగా స్వర్ణం, సిల్వర్‌ కైవసం చేసుకుంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ