Travel the world
Climb the mountains
crimeSoftware Engineer Commits Suicide by Inhaling Helium Gas in Hyderabadsuffering from stomach pain after meals for the past ten yearstelangana
హైదరాబాద్ లో హీలియం గ్యాస్ పీల్చుకొని సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్ లోని కొండాపూర్, రాఘవేంద్ర కాలనీలో 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ సౌరభ్ శేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పోలీసులకు దొరికిన సూసైడ్ నోట్‌ను గత పదేళ్లుగా భోజనం చేసిన తర్వాత కడుపునొప్పితో బాధపడుతున్నట్లు శేఖర్ పేర్కొన్నాడు. రాయదుర్గంలోని తన సోదరుడితో కలిసి నివసిస్తున్న శేఖర్ శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అదే రోజు రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో స్నేహితులతో కలిసి ఉంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆదివారం ఉదయం వరకు శేఖర్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేశారు. అయితే ఆయన స్పందించకపోవడంతో, ఆయన చెప్పిన చిరునామాకు వెళ్లారు. అక్కడ తలుపులు మూసి ఉండటంతో వాటిని తెరిచి చూడగా శేఖర్ మృతి చెంది కనిపించినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.సౌరభ్ శేఖర్ విగతజీవుడిగా పడిఉండటాన్ని చూసి వారు షాక్‌కు గురయ్యారు. మృతుని ముఖానికి నల్లటి ప్లాస్టిక్ సంచిని చుట్టుకుని ఉండగా.. పక్కనే ఉన్న హీలియం గ్యాస్ సిలిండర్ పైపును ఆ కవర్లోకి అమర్చుకుని ఉన్నాడు. దీన్ని బట్టి అతను కావాలనే హీలియం గ్యాస్‌ను పీల్చుకుని ఊపిరాడక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు గత పదేళ్లుగా ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యే అతడిని తీవ్ర మనస్తాపానికి గురిచేసి ఉంటుందని, అందుకే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment