Saturday, October 17, 2026

సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ లోని ఉండవల్లి సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. అమరావతి నగర నిర్మాణ తీరు, భవిష్యత్ రాజధాని అభివృద్ధి ప్రణాళికలు, అత్యాధునిక మౌలిక వసతుల కల్పనపై మోహన్ యాదవ్‌కు చంద్రబాబు వివరించారు. అమరావతి బ్లూప్రింట్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, ప్రజా రాజధానిగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్న విధానాన్ని ఆయనకు విశదీకరించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ అభివృద్ధి మాత్రమే కాకుండా, ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పారిశ్రామిక, సాంస్కృతిక, ఆర్థికాభివృద్ధి అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు. అలాగే, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జాతీయ రాజకీయాలపై కూడా ఇరువురు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.