Saturday, October 17, 2026

భారత్-వెస్టిండీస్ మధ్య ఆఖరి టీ20కి అంతరాయం

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్ మధ్య మొదలవ్వాల్సిన ఆఖరి టీ20కి వర్షం అంతరాయం కలిగిస్తోంది. దాంతో ఇంకా టాస్ వేయలేదు. ప్రస్తుతం మైదానంలో భారీ వర్షం కురుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 6.30 గంటలకు టాస్ వేయాల్సింది. కానీ వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని బెంగళూరు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్షం పడే సూచనలు 66-69 శాతం వరకు కురుస్తుందని చెప్పింది. మ్యాచ్ ప్రారంభమయ్యే 7 గంటల సమయంలో వర్షం పడే అవకాశం 69 శాతంగా ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ హైఓల్టేజ్ ఫైనల్ మ్యాచ్ రద్దవుతుందనే ఆందోళన నెలకొంది. ఒకవేళ మ్యాచ్ పాక్షికంగా జరిగినా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని నిర్దేశిస్తారు. భారీ స్కోర్లు నమోదైన ఈ సిరీస్‌లో ఇరు జట్లు రెండేసి విజయాలతో 2-2తో సమంగా నిలిచాయి. దాంతో ఆఖరి టీ20 సిరీస్ డిసైడర్‌గా మారింది.