హైదరాబాద్ లోని పాతబస్తీ పరిధి కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వేకువజామున బాబా నగర్ ఫంక్షన్ హాల్ సమీపంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన మహీంద్రా కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు గాల్లోకి లేచి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వాహనం బోల్తా పడిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాహన యజమానిని గుర్తించిన కాంచన్‌బాగ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad’s Old City
Kanchanbagh Police Station
Mahindra car loses control and rams into a divider
near a function hall in Baba Nagar
no fatalities reported
telangana
అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టిన మహీంద్రా కారు : తప్పిన ప్రాణనష్టం
Thursday, October 15, 2026
అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టిన మహీంద్రా కారు : తప్పిన ప్రాణనష్టం
Đăng Bởi: Telugu Lo Computer -
October 15, 2026 -
0 Bình Luận
Mọi Bài Đăng Đều Được Viết Bởi Tác Giả Blog, Vui Lòng Ghi Nguồn Niệm Style Khi Copy Bài Đăng Từ Trang Này!
Admin: Niệm Style
Tất cả bài viết đều được phát triển bởi Admin, nếu bài viết này liên quan đến nguồn hoặc bản quyền của bạn thì hãy thông báo Admin để gỡ bỏ tại đây.
BÀI VIẾT CÙNG CHUYÊN MỤC
Phản Hồi Độc Giả
Subscribe to:
Post Comments (Atom)


Một số lưu ý khi bình luận
Mọi bình luận sai nội quy sẽ bị xóa mà không cần báo trước (xem nội quy)
Bấm Thông báo cho tôi bên dưới khung bình luận để nhận thông báo khi admin trả lời
Để bình luận một đoạn code, hãy Bình Luận thoải mái nhé!