Ad Code

టీఎన్‌జీవో కాలనీలో అగ్నిప్రమాదం : సెల్లార్‌లోని 15 ద్విచక్ర వాహనాలు దగ్ధం


హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, టీఎన్‌జీవో కాలనీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా భవనం సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. వివరాల మేరకు టీఎన్‌జీవో కాలనీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సోమవారం తెల్లవారుజామున భవనంలో మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని ఒకరు గాయపడగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. భవనం పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక భవన వాసులు ఇబ్బందిపడ్డారు. భవనం సెల్లార్‌లోని 15 ద్విచక్ర వాహనాలు దగ్ధం కాగా, ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu