Ad Code

బైక్‌ తో ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించి ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం !


ధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్‌లు ఒకే బైక్‌పై స్పీడ్‌గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్‌ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్‌ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్‌లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా మధ్యలో ఒక ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీకొని ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu