News Breaking
Live
wb_sunny

Breaking News

ఫారమ్-7 విషయంలో పరిమితులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఫారమ్-7 విషయంలో పరిమితులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం

దేశ రాజకీయాలను ఎస్ఐఆర్ ప్రక్రియ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరు కుదిపేస్తున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు ఫారమ్-7 విషయంలో పరిమితులు విధించింది. ఇకపై ఒక వ్యక్తి ఫారమ్ -7 ను గరిష్టంగా కేవలం 10 మాత్రమే దాఖలు చేసేందుకు అనుమతిని ఇస్తూ లిమిట్స్ విధించింది. ముఖ్యంగా ఓ వర్గానికి చెందిన ఓటర్లను టార్గెట్ చేసుకుని పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించేందుకు బీజేపీ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఎంజెంట్లూ ప్రీ ప్రింటెడ్ ఫారమ్ -7 ను దాఖలు చేస్తున్నారనే ఆరోపణలు తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఆరోపణలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించకుండా నిరోధించడానికి ఈసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని బళ్లారితో సహా పలు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఫారమ్-7లను దాఖలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవలే తెలంగాణలో ముషీరాబాద్, బహదూర్‌పురతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఫారమ్ -7 అంశం వివాదాస్పదం అయింది. ముషీరాబాద్‍లో ఓ బీజేపీ బీఎల్ఏ నిబంధలనకు విరుద్ధంగా ఫారమ్-7 లు బల్క్ గా సమర్పించడంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చర్యలకు దిగిన ఈసీఐ తాజాగా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960లోని రూల్ 13(2) ప్రకారం ఒక నియోజకవర్గంలో పేరు తొలగింపునకు దరఖాస్తు చేసే వ్యక్తి పేరు తప్పనిసరిగా అదే నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఎస్ఐఆర్ లో ఫారం 6 డిక్లరేషన్ లేదని మొన్న చెప్పిన ఈసీఐ తాజాగా ఫారం7 విషయంలో మార్పులు చేయడం హాట్ టాపిక్‍గా మారింది. ప్రత్యేక సవరణ సమయంలో రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు బీఎల్ఓకి రోజుకు డ్రాఫ్ట్ పబ్లికేషన్‌కు ముందు 50 దరఖాస్తులు, ఆ తర్వాత రోజుకు 10 దరఖాస్తులు మాత్రమే సమర్పించేందుకు అనుమతి ఇచ్చారు. సరైన ఆధారాలు లేకుండా లేదా నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను ఈఆర్‌ఓలు తిరస్కరిస్తారు. నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తుదారులకు మొదట నోటీసు జారీ చేసి, వారిని స్వయంగా విచారించి, స్టేట్‌మెంట్లు నమోదు చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. తప్పుడు పత్రాలతో, రాజకీయ కుట్రలతో వేసే వ్యాజ్యాలు, తప్పుడు ఫారమ్-7 దరఖాస్తులపై ప్రజాప్రతినిధుల చట్టం 1950 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని ఈఆర్‌ఓలను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment