ప్రతిపక్షాల ఆందోళనల్ని ''అరాచక ఉద్యమం''గా అభివర్ణించిన బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్
ఢిల్లీలో బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఎప్పుడూ తలవంచలేదని, భవిష్యత్తులోనూ తలవంచేది లేదని అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఆయన సమర్థించారు. గత మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. భారత ప్రజాస్వామ్యం అరచకాలను ప్రేరేపించే ప్రయత్నాలను అడ్డుకుందని, దేశాన్ని పార్లమెంటే పాలిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిరసనలు జరుగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ గెలిచిన విషయాన్ని రవిశంకర్ ప్రస్తావించారు. ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రతిపక్షాల ఆందోళనల్ని ''అరాచక ఉద్యమం''గా అభివర్ణించారు. ''తాము నిరసనలకు వ్యతిరేకం కాదని, కానీ ఎన్నికల్లో ఓటముల కారణంగా మీరు వీధి పోరాటాను ఆయుధంగా మార్చుకున్నారు'' అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment