తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇప్పుడు ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయి సమన్వయంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 77 మంది సమన్వయకర్తలను నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం.. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రుల పేర్ల నమోదుపై ప్రధానంగా దృష్టి సారించింది. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని నాయకత్వం సూచించింది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నద్ధతను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గానికి 43 మందిని, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి 34 మందిని సమన్వయకర్తలుగా నియమించింది. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారికి బాధ్యతలు అప్పగించగా, ఇతర ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలకు బాధ్యతలు కేటాయించారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి అప్పగించడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నియోజకవర్గాల వారీగా నేతలంతా సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పీసీసీ నాయకత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. రెండు స్థానాల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం, పీసీసీ అధ్యక్షుడు నేతలకు సూచించినట్లు సమాచారం. ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా, అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్ల జాబితా కీలకంగా మారనుంది. తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను కొత్తగా సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే పాత జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా కొత్త జాబితాలో చోటు కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. 2026 నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా, డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటించనున్నారు. ప్రస్తుత సభ్యుల పదవీకాలం 2027 మార్చిలో ముగియనున్న నేపథ్యంలో, వచ్చే ఏడాది మార్చిలో ద్వైవార్షిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే, పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం విడిగా ప్రకటించాల్సి ఉంది.
Home
Congress Party Appoints 77 In-charges
Telangana Graduate MLC Elections
TPCC President B. Mahesh Kumar Goud has entrusted them with these responsibilities
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు : 77 మంది ఇంఛార్జిలను నియమించిన కాంగ్రెస్ పార్టీ
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

