Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

హైదరాబాద్-విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి-65 విస్తరణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ  చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన ఈ జాతీయ రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ, తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారి విస్తరణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని అధికారులను కోరారు. ప్రతిపాదిత ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా విస్తరించడంతోపాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు, నియంత్రిత ప్రవేశ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ విస్తరణ పూర్తయితే వాహనాల రాకపోకలు సులభతరమవడంతోపాటు ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రమాదాల నివారణకు, రహదారి భద్రతను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల దాఖలుకు 2026 నవంబర్ 11 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. 2027 జనవరి నాటికి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వేలాదిమంది ప్రయాణికులు, వాహనదారులకు నిత్యం కీలక రవాణా మార్గంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా విస్తరణ పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధి అంటే కేవలం ప్రయాణ సౌకర్యాలను పెంచడమే కాకుండా, ప్రజల ప్రాణాలను కాపాడటం, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వడం, తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం కూడా అని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌హెచ్-65 విస్తరణ పనులు సకాలంలో పూర్తయ్యేలా కేంద్ర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement