ఎల్నినో ప్రభావం కారణంగా ఐరోపా ఖండంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో వడదెబ్బ కారణంగా సుమారు 50వేల మందికిపైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. శిలాజ ఇంధన కాలుష్యం వల్ల కలిగే వాతావరణ మార్పుల కారణంగానే వీరిలో 32,600 మంది మరణించినట్లు తెలిపారు. అయితే, మొత్తం మృతుల్లో 65శాతం మందికిపైగా వృద్ధులేనట!. బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ లలోనూ రికార్డు స్థాయి ఉస్ణోగ్రతలు నమోదయ్యాయి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందువల్లే ఐరోపా ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. అయితే, ఈసారి ఐరోపా చవిచూస్తోన్న వడగాల్పులు అతి దారుణమైనవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిలు జారీ చేశారు. సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా కదులుతున్న వేడి గాలి, ఎల్నినో ఎఫెక్ట్ వల్లే ఐరోపాలో ఈ హీట్డోమ్ పరిస్థితులు తలెత్తాయని వెల్లడించారు.
ఐరోపా ఖండంపై భానుడి ప్రతాపం : వడదెబ్బకు 50వేల మందికిపైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడి
byTelugu Lo Computer
•
•
2 min read
