రూ.500 నోటుపై అభ్యంతరకర వీడియో : కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్‌ పటేల్‌ అరెస్టు

الاثنين، 5 أكتوبر 2026

Content Creator Simran Patel Arreste gujarat national Objectionable Video Involving Rs 500 Note Patel has approximately one million followers on Instagram surat

t f B! P L

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సిమ్రాన్‌ పటేల్‌ మహాత్మా గాంధీ చిత్రమున్న రూ.500 కరెన్సీ నోటును అభ్యంతరకర రీతిలో చూపిస్తూ సోషల్ మీడియాలో రీల్‌ పోస్ట్ చేసినందుకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 47 ఏళ్ల సిమ్రాన్‌ పటేల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సూరత్‌లోని అడాజన్‌ ప్రాంతంలో నివసించే ఆమె గాంధీ జయంతికి ముందు రోజు అక్టోబర్‌ 1న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్య తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రీల్‌లో మహాత్మా గాంధీ చిత్రమున్న కరెన్సీ నోటుకు సంబంధించి అనుచిత దృశ్యాలు, హావభావాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. సూరత్‌ పోలీసులు తమ అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా అరెస్టు విషయాన్ని వెల్లడించారు. అరెస్టుకు ముందు, అనంతరం తీసిన వీడియో క్లిప్‌లను కూడా షేర్‌ చేశారు. అనంతరం పటేల్‌ ఆన్‌లైన్‌లో వీడియో పోస్ట్ చేసినందుకు క్షమాపణలు కోరినట్లు పోలీసు వీడియోలో కనిపించింది. సామాజిక కార్యకర్త ధర్మేష్‌ గామి ఈ రీల్‌పై సూరత్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్‌ రూపంలో అశ్లీల కంటెంట్‌ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సామాజిక అశాంతికి దారితీసే అవకాశం ఉన్న కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ