కౌలాలంపూర్ అంతర్జాతీయ విద్యా సదస్సుకు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డాక్టర్ శంకర్‌కు ఆహ్వానం

الاثنين، 5 أكتوبر 2026

Andhra Pradesh Invitation Extended to Second Class Magistrate Dr. Shankar for International Education Conference in Kuala Lumpur Malaysia Mydukur

t f B! P L

మలేషియా లోని కౌలాలంపూర్ నిర్వహించే అంతర్జాతీయ విద్యా సదస్సుకు మైదుకూరు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్కు ఆహ్వానం అందింది. గ్లోబల్ జ్ఞాన్ అకాడమీ అంతర్జాతీయ విద్యా సంస్థ ద్వారా ఈనెల 14వ తేదీ నిర్వహించే ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పలువురు మేధావులను ఆహ్వానించినట్లు గ్లోబల్ జ్ఞాన్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ రుక్సానా తెలిపారు. డాక్టర్ శంకర్ విద్యార్థులకు మానసిక ఒత్తిడి ,నివారణ వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, జాతీయ సమైక్యత తదితర విషయాలపై దాదాపు 15వందల పైన ఉపన్యాసాలు చేశారు. ప్రజల్లో ధార్మిక భావాలు పెంపొందించే దిశగా సుమారు సుమారు 2 వేలకు పైబడి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ద్వారా చైతన్యపరిచారు. రాష్ట్రస్థాయి , దేశ స్థాయిలో గుర్తింపు పొందిన దృష్ట్యా శంకరును ఈ సదస్సుకు ఆహ్వానించినట్టు గ్లోబల్ జ్ఞాన్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. సదస్సులో విద్యా వ్యవస్థలోని పలుఅంశాలపై చర్చిస్తామన్నారు. ఆహ్వానితులకు విద్యా పురస్కారాలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ